YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహానపై సమాచారం ఇవ్వండి

ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహానపై సమాచారం ఇవ్వండి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఈ నెల 29 న న్యూడిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మున్సిపల్ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ కు సంబంధించి తీసుకున్న చర్యలపై నిర్వహించే సమావేశానికి సంబంధించి సంబంధిత శాఖలు అవసరమైన సమాచారాన్ని ఈ నెల 23 లోగా పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. 
శనివారం సచివాలయంలో  మున్సిపల్ ఘన వ్యర్ధాల నిర్వహణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించే సమావేశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,  మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, పిసిబి కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, పరిశ్రమలశాఖ కమీషనర్ నదీమ్ అహ్మద్, మున్సిపల్ డైరెక్టర్ మరియు కమీషనర్ టి.కె.శ్రీదేవి లతో పాటు గనులు, ఆరోగ్య, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8450 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు జనరేట్ అవతుండగా, 8273 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్నామని 95.9 శాతం డోర్ టు డోర్ ద్వారా సేకరిస్తున్నామని అన్నారు.  సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంటు రూల్స్ 2016 కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని అన్నారు. మున్సిపాలిటీలకు డిపిఆర్ ల తయారి, డంపింగ్ యార్డుల స్ధలసేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుల ఏర్పాటు, వేస్ట్ బర్నింగ్ పై ప్రజలకు అవగాహణ తదితర అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్, కన్ స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ నియమాల అమలుకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. ఈ నియమాల పర్యవేక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ప్రత్యేక అధికారులను బాధ్యులుగా చేయాలన్నారు. రాష్ట్రంలో 11 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ ద్వారా ప్రతి  రోజు 15 వేల కేజీ లకు పైగా బయోమెడికల్ వేస్ట్ ను సేకరిస్తున్నామని  అధికారులు సి.యస్ కు వివరించారు. భవన నిర్మాణ వ్యర్ధాలను రీసైక్లింగ్ కోసం కొత్త ప్లాంటులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సి.యస్ కోరారు. 50 మైక్రాన్ల తిక్ నెస్ లోపు ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను  నిషేదించామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
నదుల పునరుజ్జీవం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల  ప్రకారం నదులలో కాలుష్య నివారణకు నిర్ధిష్ట కాలపరిమితితో  కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ విషయమై ఇప్పటికి సమావేశాలు నిర్వహించామని  మొదటి, రెండవ ప్రయారిటీలో స్ట్రెచెస్ సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నివేధికను సమర్పించామని, మిగతా స్ట్రెచెస్ సంబంధించి జూన్ 30 నాటికి నివేధికలను సమర్పిస్తామన్నారు, 
వాయు, పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రాష్ట్రంలో ఈటీపీ, సీఈటీపీ, ఎస్టీపీ ల ఏర్పాటు, పనితీరును సమీక్షిస్తూ 1979 పరిశ్రమలలో ఈటీపీలు  పనిచేస్తున్నాయని, పనిచేయని వాటికి షోకాజ్ నోటీసు జారీచేసి మూసివేత చర్యలు తీసుకుంటున్నామన్నారు. 372 ఎస్టీపీలు ఉన్నాయని అన్నారు. పటాన్ చెరువు ఏరియాలో ఖాజిపల్లి, ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట, గండిగూడెం, ఆసానికుంట చెరువులలో కాలుష్య నివారణకు ఎస్టీపాల ల ఏర్పాటు కై, నెలలోగా డీపీఆర్ ల తయారితో పాటు నిధుల సేకరణకు వ్యూహాన్ని తయారు చేయాలన్నారు. ఈ విషయమై ఎన్జీటీ  చెన్నై జారీచేసిన ఆదేశాలపై ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, భూగర్భజల వనరులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో సమీక్షించారు.

Related Posts