YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ విషెస్

కేటీఆర్ విషెస్

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘అలుపెరుగని శ్రామికుడు, అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు, గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు??? శతమానం భవతు???  అని ట్వీట్ చేశారు. 

Related Posts