YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
తెలంగాణ లో జడ్పీటీసీ ఎంపీటీసీ  ఎన్నికల షెడ్యూలు శనివారం వెలువడింది. రాష్ట్రంలో వ్యాప్తంగా 535 జడ్పీటీసీ లు 5 వేళా 817 ఎంపిటిసి లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1 కోటి 56 లక్షల 11 వేలా 320 మంది ఓటర్లు వున్నారు. ఈ నెల 22 మొదటి విడత నోటిఫికేషన్ వుంటుంది. మే 6 వ తేదీన  పోలింగ్,  ఏప్రిల్ 26 రెండవ విడత నోటిఫికేషన్, మే 10 వ తేదీ న పోలింగ్,  ఏప్రిల్ 30 న మూడవ విడత నోటిఫికేషన్,  మే 14న పోలింగ్ వుంటుంది. మొత్తం మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతలో 212  జెడ్పిటిసిలు, 2365 ఎంపిటిసిలు, 2 వ విడతలో 199 జెడ్పిటిసిలు, 2109 ఎంపీటీసీలు,  3వ విడతలో 124 జెడ్పిటిసిలు, 1343 ఎంపిటిసిలని ఎన్నికలుంటాయి. మొత్తం 535 జెడ్పిటిసిలు, 5817 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 32007 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 

Related Posts