
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఛత్తీస్ గఢ్ నుండి కోస్తాకర్ణాటక వరకు తూర్పువిదర్భ, తెలంగాణ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.