YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

22 నుంచి పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే నిలిపివేత

22 నుంచి పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే నిలిపివేత
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎయిర్ పోర్ట్ కు వెళ్లే మెయిన్ రూట్ అయిన పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేను కొన్ని రోజులు నిలిపివేయనున్నారు. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకూ ఉన్న పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఏప్రిల్ – 22 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. రోడ్ల మరమ్మతుల కోసం హైవేను నిలిపివేస్తున్నామని.. పని త్వరగా పూర్తికాగానే హైవేపై అనుమతి ఉంటుందని తెలిపారు సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్.  పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై అనేక వాహనాలు ప్రయాణించడంతో కొన్నిచోట్ల రోడ్డు పాడైందని.. దీంతో బ్లాక్ టాప్ వేసేందుకు ఎక్స్‌ప్రెస్ వే‌ ను తాత్కాలికంగా మూసివేస్తున్నామని తెలిపారు. కొద్దిరోజుల్లోనే హైవేపై అనేమతి ఉంటుందని .. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌, ఆర్జీఐ వరకూ రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునేవారు మెహిదీపట్నం నుంచి పివిఎన్ఆర్ ఎక్స్‌ ప్రెస్‌ వే కింద నుంచి వెళ్లాలని.. అటు నుంచి వచ్చే వారు ఆరాంఘర్‌, శంకర్‌ పల్లి, పిడిపి ఎక్స్‌ రోడ్‌, ఉప్పర్‌ పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్‌, రేతిబౌలిల మీదుగా రావాలని సూచించారు.

Related Posts