
టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి సర్వం సిద్ధమయింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, వీరిలో 10 మంది ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనివల్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమున్న ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన విలీనం లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.