
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన తాటిపర్తి జీవన్ రెడ్డి మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎదుట శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుప్రత్యేకంగా హాజరయ్యారు. భట్టితోపాటు ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.