
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజూ ఉధ్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్‌బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. మరోపక్క ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.