YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పార్టీ నేతల సమాచారాన్ని సీల్డ్ కవర్ లో ఇవ్వండి

పార్టీ నేతల సమాచారాన్ని సీల్డ్ కవర్ లో ఇవ్వండి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

స్థానిక సమస్యలను త్వరలో తీరుస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస పార్టీ నేతలకు హమీనిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద మంత్రి  సనత్ నగర్ నియోజక వర్గంలోని సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.  స్థానిక సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సనత్ నగర్ లో ఉన్న ప్రతి సమస్యను తన దృష్టికి తీసుకురావాలని వాటిని తీర్చే బాధ్యత నాదని  అన్నారు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిని గురించి తనకు సీల్డ్ కవర్లో పంపించాలని కార్యకర్తలను కోరారు.. ఆ కవర్ నేనే చదువుతాను. ఉన్నది ఉన్నట్లు రాయాలని కోరారు..వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు..ఎన్నికల కోడ్ దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేం.  కానీ ఈ నెల 27 నుండి సనత్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి వారి సమస్యలను తెలుసుకుంటానని వారికి హామీనిచ్చారు..  

Related Posts