
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గత రాత్రి నుండి హైదరాబాద్ నగరంలో కురిసిన ఆకస్మిక ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ కు 95 ఫిర్యాదులు అందాయని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. నగరంలో 85 ప్రాంతాల్లో చెట్లు కూలిన ఫిర్యాదులు అందగా తయారు ప్రాంతాల్లో తొలగించాం. ట్రాఫిక్ కు ఏ విధమైన లేకుండా జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రధాన రహదారులపై కూలిన చెట్లను తొలగించాయి. ఎనమిది ప్రాంతాల్లో ఏర్పడ్డ నీటి నిల్వలను మాన్సూన్ బృందాలు తొలగించాయని అయన అన్నారు.
మంగళవారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 200 మంది సభ్యులు గల 8 డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని దాన కిషోర్ చెప్పారు.