YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికలు ముగిసిన కొనసాగుతున్న వలసలు

 ఎన్నికలు ముగిసిన కొనసాగుతున్న వలసలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల ముందు ఎక్కడైనా నేతల పార్టీ మార్పులు సాధారణం. కానీ తెలంగాణలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినా వలసల పర్వం కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీదళంలోకి క్యూకడుతున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ ప్రచారంపై స్పందించిన జగ్గారెడ్డి స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం విశేషం. టీఆర్ఎస్‌లో చేరతానని గానీ, లేదు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని గానీ ఆయన చెప్పలేదు. పార్టీ మార్పుపై తానిప్పుడే ఏమీ చెప్పలేనని..కాలమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ మారతానన్న ప్రచారంపై ఇప్పుడు స్పందించలేదు. పార్టీ మారతానా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. పీసీసీ, సీఎల్పీ తప్ప అందరి కోస ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాత్రం ప్రయత్నాలు జరగడం లేదు. నేనయితే టీఆర్ఎస్‌ను సంప్రదించలేదు. వాళ్లు ఆహ్వానిస్తే వెళ్లాలా? వద్దా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. హరీశ్ రావుపై వ్యక్తిగతంగా వ్యతిరేకమేమీ లేదు. నా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లను తీసుకెళ్లారనే ఆయనపై విమర్శలు చేశా. ఎమ్మెల్యేలకు ఉత్తమ్, భట్టి గట్టి భరోసా ఇస్తున్నారు. ఐనా వాళ్లు వెళ్తున్నారు. వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లి కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు.అంతేకాదు కాంగ్రెస్ తరపున కేటీఆర్‌, హరీశ్ రావుపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు జగ్గారెడ్డి. ముఖ్యంగా హరీశ్ రావు టార్గెట్‌గా నిత్యం మండిపడుతుంటారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ హైకమాండ్ ఆయన ఎంట్రీని నిరారిస్తుందేమోనని జగ్గారెడ్డి ఊగిసలాడుతున్నట్లు సమాచారం. అందుకే తనంతట తానుగా టీఆర్ఎస్‌ పెద్దలను సంప్రదించేందుు వెనకడుగు వేస్తున్నారు. కానీ అటు వైపు నుంచి ఆహ్వానం వస్తే మాత్రం వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Related Posts