
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు సినీ ప్రేక్షుకులకు పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ విజయశాంతి. మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషాల్లో 180 సినిమాలకు పైగా నటించింది. 1998లో రాజీకియాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.ఆ తర్వాతపెద్దగా సినిమాల్లో ఎక్కడా కనిపించకపోయిన ఆమె.. రాజకీయాల్లో మాత్రం చురుకుగా పాల్గొన్నారు. 2007లో హిందీలో వచ్చిన జమానత్ సినిమాలో ఆమె చివరి సారిగా నటించారు. అయితే మరోసారి మెకప్ వేసేందుకు సిద్ధమవుతున్నారు విజయశాంతి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో ఆమె ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం.గ్లామర్ పాత్రలతో పాటు... ఒసేయ్ రాములమ్మ,ప్రతిఘటన,కర్తవ్యం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోను నటించిన విజయశాంతి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే మరోసారి విజయశాంతిని సినిమాల్లోకి తీసుకురావాలని చాలామంది కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో న్యూడైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. మహేష్ బాబుతో తను రూపొందించే సినిమాలో నటించేలా విజయశాంతిని ఒప్పించారు. దీంతో మరోసారి వెండితెరపై విజయశాంతి అందర్నీ అలరించనున్నారు. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా దిగ్రేట్, ఎఫ్2 చిత్రాలతో వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు.