
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఈనెల 27 అంబెడ్కర్ వాదుల మహా గర్జన జరగనున్నది. ప్రభుత్వం నుండి ఎన్ని అడ్డంకులు ఎదురైన ప్రశ్నించే హక్కును కాపుడుకోవడానికి అంబెడ్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు అంబెడ్కర్ వాదుల మహాసభ కు రావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అన్యాయం గురైనపుడు ప్రతి ఒక్కరు స్పందించాలి మౌనంగా ఉండడం నేరం. ప్రశ్నించడాన్ని ఓర్వని వారు ప్రజాస్వామ్య వాదులు కారు. నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు..నిరసన ను అడ్డుకుంటున్న ప్రభుత్వమే నేరం చేసినట్టునని అన్నారు. నియంతృత్వ ధోరణి తో మమ్ములను అడ్డుకుంటున్నారు. కేసీఆర్ ను ప్రశ్నించడం తప్పా... కేసీఆర్ ఎందుకు అంబెడ్కర్ జయంతి ఉత్సవాల లో ఎందుకు పాల్గొనడం లేదు సమాధానం చెప్పాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు కూడా పర్మిషన్ లేదు.దాన్ని ఎందుకు తీయలేదు. అంబెడ్కర్ విగ్రహాన్ని ఎందుకు కూలగొట్టారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీలో నిరసన చేస్తాము అని చెప్పలేదు. నిరసన చేసుకునే ఇందిరా పార్క్ లో ధర్నాచౌక్ లో చేస్తాం అంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. ఈనెల 17 వతేది ధర్నా చౌక్ లో పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. కోర్ట్ చెప్పింది ధర్నా చౌక్ లో నిరసన తెలపవచ్చు అని కోర్ట్ చెప్పిన మాకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు..పర్మిషన్ ఇవ్వకుండా నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు నియతృత్వం ను సహించరు. 27 వతేది పర్మిషన్ కోసం ఇప్పుడు అప్లై చేస్తున్నాం. మాకు 24 గంటలలో సమాధానం ఇవ్వాలి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము కోర్ట్ కు వెళుతాము. మీరు పర్మిషన్ రేపు ఇవ్వకపోతే డీజీపీ ,హోమ్ మంత్రి ని కలుస్తామని అన్నారు. ఎల్లుండి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే ఎల్లుండి కలుస్తాము పర్మిషన్ ఇవ్కపోతే బహిరంగ లేఖ రాస్తాం. రాష్ట్రంలో జరిగిన పరిస్తితులపై రాష్ట్రపతి కి వివరిస్తాం. అంబెడ్కర్ వాదుల మహాసభ కు పెద్ద ఎత్తున అంబెడ్కర్ వాదులు తరలి రావాలని కోరారు.