
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిజమాబాద్ జిల్లా పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం గత ఐదేళ్లుగా కృషి చేశారని, ఈ విషయలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దాదాపు యాభై మంది రైతులు "చలో వారణాసి" కార్యక్రమం తలపెట్టారు. పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కి నిరసనగా మోడీ పై పోటీ చేసేందుకువారణాసి బయల్దేరుతున్నామని అన్నారు. వీరికి మద్దతుగా తమిళనాడు రైతులు కూడా చలో వారణాసికి సిద్దమయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని టీఆర్ఎస్ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని విమర్శించారు.. అందుకే మా లక్ష్యం నిర్వీర్యం అయ్యిందని అన్నారు. మేము పోటీ చేసేది మా సమస్యల కోసమే. గత ఐదేళ్లుగా కవిత పసుపు బోర్డు కోసం తీవ్రంగా శ్రమించారు కృషి చేసారు. ఇస్తామని చెప్పి మోసం చేసింది బీజేపీ. అందుకే మేము మోడీపై పోటీ చేసి జాతీయ పార్టీల నేతలను కలుస్తామని వారు వెల్లడించారు.