
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్ పరీక్ష తప్పానని మనస్థాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల లో జరిగింది. సారంగాపూర్ మండలం పోచంపేట్ గ్రామానికి చెందిన వొడ్నాల శివాని అనే విద్యార్థిని ఇంటర్ పరీక్షలో మూడు సబ్జెక్ ఫెల్ అయిందని మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసిన శివాణి నిన్న ప్రకటించిన ఫలితాల్లో 3 సబ్జెక్టులు తప్పడంతో నిన్నటి నుండే ఆవేదనతో ఉన్న శివాణి రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శివాణి తండ్రి పొలం దగ్గరి కరెంటు మోటార్ పెట్టేందుకు ఉదయం 3 గంటలకు లేచి వెళ్ళే క్రమంలో ఇంట్లోకి వెళ్ళి చూడగా ఉరివేసుకుని ఉండగా కుటుంబ సభ్యులనం లేపి పరిశీలించగా అప్పటికే శివాణి చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.కేసు నమోదు చేసుకున్న సారంగాపూర్ పోలీసులు శివాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల సివిల్ హాస్పిటల్ కు తరలించారు.