
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భూపాలపల్లి లో మంగళవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, గండ్ర జ్యోతి ముఖ్య అనుచరులతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో గండ్ర దంపతులు భావోద్వగాయానికి లోనై కంట నీరు పెట్టారు. మాకు పదవులు ముఖ్యం కాదు. కార్యకర్తలు సంయమనం పాటించాలి. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారాను. మమ్మల్ని నమ్మిన వారిని కాపాడుకుంటామని అన్నారు. జడ్పీ చైర్మన్ పదవి కోసం పార్టీ మారం అనేది వాస్తవం కాదు. ఇపుడు తీసుకున్నా నిర్ణయానికి కొందరు భాద పడి ఉండొచ్చు ఎవరికీ అన్యాయం జరగదని ఎమ్మెల్యే అన్నారు. నాపై అవాకులు చేవాకులు ఆగాలనే పార్టీ మారను. ఒకడు జిల్లాను తరలిస్తా అంటాడు. ఇంకకొడు ఎలా అభివృద్ధి జరుగుద్దో చూస్తా అంటాడు. ఇంకోకడు ఎలా తిరుగతాడో చూస్తా అంటాడని అయన అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అవమానాలు భరించే కన్నా అధికార పార్టీలోకి వచ్చి ప్రజలకు అభివృద్ధి చేసి, మాటలు చెప్పే వారికి నాపని తో సమాధానం చెప్పాలని వచ్చానని అన్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో ఉన్నారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ ఎస్ లో చేరాను. ఒకే సారి ఆహ్వానించగానే వెళ్ళలేదు. అన్ని ఆలోచించి వెళ్ళానని అన్నారు.