
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అభినందన్ విడిచి పెట్టక పోతే పాకిస్తాన్ కు కాళరాత్రి అని నరేంద్రమోడీ మాట్లాడడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పు పట్టడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉన్న వ్యక్తి పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం తీవ్రమైన చర్యగా భావించి శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ నేత రామచంద్రరావు డిమాండ్ చేసారు. ఈ మేరకు క ప్రకటన విడుదల చేసారు. మన దేశ సైనికులను పాకిస్తాన్ పట్టుకుంటే విడిపించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఆత్మస్థైర్యంతో దేశ ప్రజలు ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ఉండేవిధంగా పాకిస్తాన్ హెచ్చరించడమే కాకుండా తగిన బుద్ధి చెప్పిన విషయం టిఆర్ఎస్ నాయకులు మర్చిపోవద్దు. మన జోలికి వస్తే పాకిస్తాన్కు కాలరాత్రి కాకుంటే శుభరాత్రి అవుతుందా అని ప్రశ్నించారు.
బిజెపి నేత త్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో ఉగ్రవాదంపైన కఠిన చర్యలు తీసుకున్నది. ముందస్తుగా ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాధ్యం అయింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లో వైఫల్యం చెందడంతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా విషయం పక్కదారి పట్టించాలని అనుకోవడం సరికాదు. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సహం స్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి, జాతి వ్యతిరేక విధానాలు, విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అయన అన్నారు.
ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతకు సంబంధాలున్నాయని అందుకే జరిగిన తప్పిదాలపై సిబ్బంది పైన గాని, అధికారుల పైన గాని చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని బిజెపి బావిస్తుంది. ఇంటర్ పరీక్షా ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఎటూ పాలుపోని స్థితిలో నిరాశా, నిస్ప హలకు లోనైన టిఆర్ఎస్ పార్టీ నేతలు బిజెపిపై దుమ్ము పోసి కాలం వెళ్లబుచ్చాలి అనుకోవడం సరికాదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలలో భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ హైదరాబాదుకు వచ్చి పట్టుకునే వరకు ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలని అయన డిమాండ్ చేసారు..