
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేములవాడలో ఏసీబీ అధికారుల దాడులు మరో మారు కలకలం రేపాయి. ఇటీవల వేములవాడ పంచాయతీరాజ్ శాఖలో 60 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు డీఈఈ పట్టుబడిన సంఘటన మరువక ముందే మరో అవినీతి చేప అనిశాకు చిక్కడం వేములవాడలో సంచలం సృష్టించింది. మండలంలోని చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వ్యక్తుల వ్యవసాయ భూమిలోని ప్లాట్లను కొలతలు చేసి ఇవ్వడానికి మండల సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధికశాఖ అధికారులను ఆశ్రయించారు. వేములవాడ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా సర్వేయర్‌ను, అతని సహాయకుడ్ని పట్టుకున్నారు.