YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటర్ బోర్డు తీరుకు రాలిన మరో విద్యా కుసుమం..19 కిచేరిన మృతుల సంఖ్య

ఇంటర్ బోర్డు తీరుకు రాలిన మరో విద్యా కుసుమం..19 కిచేరిన మృతుల సంఖ్య

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:  

తెలంగాణలో 18మంది ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు పోయినా ఇంటర్ బోర్డు తీరు మారడంలేదు. ఫలితాల్లో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న వారికి నిరాసే ఎదురవుతుంది. బోర్డు అధికారులు సక్రమంగా స్పందించడంలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసెలా రోధిస్తున్నారు.మెదక్ జిల్లా చినశంకరంపేట్ మండలం మడూర్ గ్రామానికి చెందిన రాజు ఇంటర్ సీఈసీ గ్రూప్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు. బాగా చదివి రాసినా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన రాజు బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల సంఖ్య 19కి పెరిగింది. రాజు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Posts