YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇండిగో డిస్కౌంట్ ఆఫర్స్

ఇండిగో డిస్కౌంట్ ఆఫర్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రైవేట్ రంగ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చేసింది. ఆఫర్‌లో భాగంగా 10 లక్షల సీట్లను డిస్కౌంట్ ధరతో ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇండిగో టికెట్ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభమౌతోంది. డిస్కౌంట్ ఆఫర్ మే 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనుంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ నాన్ స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు కంపెనీ విమాన టికెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. డిజిబ్యాంక్ డెబిట్ కార్డుతో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ పొందాలంటే టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ.4,000 ఉండాలి. అదే మొబిక్విక్‌తో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది

Related Posts