YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహేశ్ లేకుంటే 'మహర్షి'ని ఎవరు చూస్తారు - వర్మ

మహేశ్ లేకుంటే 'మహర్షి'ని ఎవరు చూస్తారు - వర్మ

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న వేళ, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గ్రామాలన్నా, పంట పొలాలన్నా పడదని, అందువల్ల తాను రైతుల ఆధారిత కథలను సినిమాలుగా నిర్మించలేనని అన్నారు. ఏ సినిమాలోనూ సందేశం ఇవ్వాలని కూడా తాను ప్రయత్నించబోనని అన్నారు. మహేశ్ బాబు లేకుంటే 'మహర్షి' సినిమాను ఎంత మంది చూస్తారని ప్రశ్నించిన ఆయన, సినీ ప్రేక్షకులు హీరో, పాటలు, కామెడీ సన్నివేశాల కోసమే సినిమాలకు వస్తారని అన్నారు.

Related Posts