
యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
తన సినిమా ఆఫర్ ను పవన్ కల్యాణ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఇటీవల పవన్ ను కలసి సినిమా చేయమని అడిగానని, అయితే ఇక సినిమాలు చేసే ఉద్దేశమే లేదని చెప్పారని ఆయన తెలిపారు. అయినప్పటికీ పవన్ తో సినిమా కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని గణేశ్ చెప్పారు.