YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

డీబీటీ స్కీమ్ తో 1.14 లక్షల కోట్ల ఆదా

 డీబీటీ స్కీమ్ తో  1.14 లక్షల కోట్ల ఆదా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

డబ్బులు ఆదా చేయడం అంత సులువైన విషయం కాదు. ఒక చోటు ఆదా చేశామని ఊపిరి పీల్చుకునేలోపు మరొక ఖర్చు వచ్చి ఆ సేవింగ్స్‌ను ఖాళీ చేసేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేయడం కూడా గొప్ప విషయమే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1.14 లక్ష కోట్లకు పైగా ఆదా చేసింది. అది ఎలా అనుకుంటున్నారా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీమ్ ఇందుకు కారణం. ఇందులో సబ్సిడీ ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా చేరుతాయి. 2019 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లను ఆదా చేసింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని 2013 జనవరిలో ప్రారంభించింది. ఇందులో లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్లలోనే పడిపోతుంది. దీంతో అక్రమార్కులకు, అవినీతికి అడ్డుకట్ట పడింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.7.33 లక్షల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. దేశంలో ప్రస్తుతం 439 సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. 2018-19లో దాదాపు 59 కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది

Related Posts