YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ధిక్కారం.. దేనికి సంకేతం?

ధిక్కారం.. దేనికి సంకేతం?

  భారత ప్రజాస్వామ్యం ప్రధానంగా నాలుగు స్తంభాల మీద నిలబడింది. అవి శాసన, కార్యనిర్వాహక, న్యాయ, పత్రికా రంగాలు. ఈ నాలుగు స్తంభాలలో ఏ ఒక్కటి కాస్త కదిలినా ప్రజాస్వామ్య సౌధం పునాదులే కదిలిపోతాయి. అందుకే నాలుగింటి సమన్వయంతో ఇన్నేళ్లుగా స్వతంత్ర భారతదేశంలోని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. కానీ ఒక్క భారతదేశమే కాదు...మరే దేశచరిత్రలోనూ ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా ఒక్కసారి మన దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలోనే కలకలం రేగింది. ప్రధాన న్యాయమూర్తి తర్వాత అత్యంత సీనియర్ న్యాయ మూర్తులుగా ఉన్న నలుగురు కలిసి దేశ అత్యున్నత న్యాయ మూర్తిపైనే తిరుగుబాటు ప్రకటించారు. సహజంగా ఏ వ్యవస్థలోనైనా వ్యక్తుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు రావడం సర్వసాధారణం. చేతికున్న ఐదు వేళ్లే ఒక్కలా ఉండవు కాబట్టి ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. కానీ గుప్పెట మూసి ఉన్నంతవరకే దానికి బలం ఉంటుంది. 

సుప్రీంకోర్టులో రేగిన కలకలం మామూలుది కాదు. సాధారణంగా న్యాయవ్యవస్థ అంటే దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక గౌరవం ఉంటుంది. కోర్టును న్యాయాలయాలు అంటారు. అక్కడ న్యాయదేవత ఉంటుందని, న్యాయమూర్తులని... ఇలా అన్నిరకాలుగా న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్క అంశాన్నీ ఎంతగానో గౌరవిస్తారు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య గొడవలు వచ్చినా, భార్యాభర్తలు గొడవ పడినా, అన్నదమ్ములు ఆస్తికోసం కొట్టుకున్నా, ఒక నేరస్తుడు నేరం చేశాడన్న విషయాన్ని నిరూపించి అతడికి శిక్ష పడేలా చూడాలన్నా, ఒక నాయకుడి అవినీతిని నిరూపించాలన్నా... ఇలా మనదేశంలో ప్రతి చిన్న, పెద్ద విషయాలన్నింటికీ మన కోసం ఒక న్యాయస్థానం ఉందన్న భరోసా అందరికీ ఉం టుంది. మనకు న్యాయం జరగాలంటే ఎవరి తలుపు తట్టాలి అంటే, ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చేది కోర్టులే. కోర్టు గుమ్మం ఎక్కితే చాలు- ఎన్నేళ్లయినా సరే తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉండబట్టే అక్కడకు వెళ్తాం. అంతెందుకు, ఎవరైనా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాదులాట వరకు వెళ్తే, ‘నిన్ను కోర్టుకీడుస్తా... నీ సంగతి తేలుస్తా’ అంటారు. అంటే, అన్యాయం చేసినవాడికి కోర్టు తగిన విధంగా శిక్ష వేస్తుందన్న నమ్మకం సగటు భారతీ యులలో బలంగా ఉంది. అందుకే ఈ వ్యవస్థను ఇన్నాళ్లూ చాలా గౌరవంగా చూసుకుంటూ వచ్చారు.
 
చీఫ్ జస్టిస్‌పై నలుగురు జడ్జీల తిరుగుబాటు
కానీ శుక్రవారం నాడు భారతీయ న్యాయవ్యవస్థలోనే అత్యంత అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొలువుదీరిన నలుగురు సీని యర్ జడ్జీలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగో య్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్ కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు అనే వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. అసలు సుప్రీంకోర్టులో పరిపాలనా విధానాలే సక్రమంగా లేవని వాళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో దేశమంతా అవాక్కయింది. ఈ విషయాన్ని వివరించి, వాటిని సరిచేయా లని తాము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు చెప్పాలని ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదని, ఆయ నకు నచ్చజెప్పడంలో తాము విఫలమయ్యామని న్యాయ మూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలను నివారిం చేందుకు, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తామెంత ప్రయత్నం చేసినా ప్రధాన న్యాయమూర్తి వినిపించుకోక పోవడంతో ఇప్పుడు న్యాయవ్యవస్థే ప్రమాదంలో పడిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నారు. 


                 సర్వసాధారణంగా ఇప్పటివరకు మన దేశచరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఇలా సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు ప్రధాన న్యాయమూర్తి మీద తిరగబడిన దాఖ లాల్లేవు. ప్రధాన న్యాయమూర్తి అనేవారు సమానులలో ప్రథ ముడు మాత్రమే తప్ప అంతకంటే ఎక్కువా కాదు, తక్కువా కాదని న్యాయమూర్తులు అన్నారు. అయితే, సాధారణంగా క్రీడలలో కూడా ఇదే నియమాన్ని చెబుతారు. ఉదాహరణకు ఒక క్రికెట్ జట్టునే తీసుకుంటే కెప్టెన్ అనేవాడు కూడా ఆటగాళ్లందరిలో ఒకడే. వాళ్లలో సమానుల్లో ప్రథముడే. కానీ, ఏ ఫీల్డర్‌ను ఎక్కడ మోహరించాలో, బౌలింగ్‌కు ఎవ రిని పంపాలో, ఏ బ్యాట్స్‌మన్‌ను ఏ స్థానంలో పంపాలో కెప్టె నే నిర్ణయిస్తాడు. కెప్టెన్ నిర్ణయాలు ఒకోసారి బాగుండవచ్చు, ఒకోసారి బాగోకపోవడం వల్ల మ్యాచ్ ఓడిపోవచ్చు. అవసర మనుకుంటే- మరీ వ్యతిరేకత ఎక్కువైతే కెప్టెన్లను మారు స్తుంటారు. అది క్రీడల వరకు పర్వాలేదు. కానీ సామాన్యుల నుంచి అత్యంత పెద్దమనుషుల వరకు ప్రతి ఒక్కరూ న్యాయం కోసం తలుపుతట్టే.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ లోనే ఇలా జరిగితే!! అసలు ఇలా జరిగేందుకు వీలుందని కూడా ఎవరూ ఇంతవరకు ఊహించలేదు.

                సాధారణంగా ఏకసభ్య ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఇలా.. రకరకాలుగా బెంచీలు ఉంటాయి. వీటిలో ఎంత తీవ్రత ఉన్న కేసును ఏ బెంచికి కేటాయించాలన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఏదైనా బెంచిలో ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక సభ్యుడైతే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. ఒకోసారి అత్యంత అసా ధారణ కేసులకైతే ఫుల్‌కోర్టు.. అంటే మొత్తం న్యాయమూర్తు లందరూ కూడా ఒకే ధర్మాసనంలో ఉండే అవకాశం ఉంది. ఇలా బహుళ సభ్యులన్న ధర్మాసనాలలో కొంతమంది ఒక వైపు, మరికొంతమంది మరోవైపు తీర్పులు ఇచ్చిన సంద ర్భాలు భారతీయ న్యాయవ్యవస్థలో ఉన్నాయి. అంతమాత్రా న కొంతమంది న్యాయమూర్తులు ఒకవైపు పక్షపాతం చూపించారనుకోడానికి వీల్లేదు. న్యాయమూర్తుల అభిప్రా యాలు కూడా వేర్వేరుగా ఉండొచ్చు. ఒక విషయాన్ని ఎవరు ఏ కోణంలో చూశారన్నదాన్ని బట్టి వారి నిర్ణయం ఉంటుం ది. ఉదాహరణకు ఒక హత్య జరిగినప్పుడు అది ఆవేశంలో చేశారా, ఆలోచించి ప్లాన్‌చేసి మరీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేశా రా, లేదా ఇవేవీ కాకుండా.. తనమీద వేరేవారు దాడి చేసి నపుడు ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో అనుకోకుండా అవతలివాళ్ల ప్రాణాలు తీశారా.. ఇలా ఇన్ని రకాలుగా చూడాల్సి ఉంటుంది. అది ఎలా జరిగిందని న్యాయమూర్తి విశ్వసించారో.. దాన్నిబట్టి నిందితులను దోషులుగా తేలు స్తారా.. లేదా అన్నది ఆధారపడుతుంది. త్రిసభ్య ధర్మాసనా లలో ఇద్దరు ఒకవైపు, మరొకరు మరోవైపు తీర్పుచెప్పిన సందర్భాలు కూడా మనంచూశాం. ఉదాహరణకు జయల లిత ఆస్తుల కేసు తీర్పు విషయానికే వస్తే న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా వృత్తిపరంగా భిన్నా భిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండటం సర్వసాధారణం. అన్ని వ్యవస్థలలో ఉన్నట్లే న్యాయవ్యవస్థలో కూడా ఇలా ఉంటుంది. 


                కానీ ఇవేవీ కాకుండా పూర్తిగా వ్యవస్థ మొత్తం భ్రష్టు పడుతోందని, పరిపాలనే సరిగా లేదని, బెంచీల కేటాయింపు లో వివక్ష కనపడుతోందని విమర్శలు వచ్చాయంటే మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిందే. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండబోదని భావించారో ఏమో.. న్యాయమూర్తులు తమ ఆవేదనను ఇలా మీడియా ముందుకొచ్చి దేశం మొత్తం వినేలా చెప్పారు. వారిలో సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఉండటం గమనార్హం. రేపు తాను ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్న విషయాన్ని కూడా స్వయంగా ఆయనే చెప్పినట్లయింది. ఈ ధిక్కారం దేనికి సంకేతంగా నిలుస్తుంది? 

 భారతీయ న్యాయవ్యవస్థలోనే అత్యంత అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొలువుదీరిన నలుగురు సీని యర్ జడ్జీలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగో య్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్ కలిసి ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు అనే వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. అసలు సుప్రీంకోర్టులో పరిపాలనా విధానాలే సక్రమంగా లేవని వాళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో దేశమంతా అవాక్కయింది. ఈ విషయాన్ని వివరించి, వాటిని సరిచేయా లని తాము ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు చెప్పాలని ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదని, ఆయనకు నచ్చజెప్పడంలో తాము విఫలమయ్యామని న్యాయ మూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలను నివారించేందుకు, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు తామెంత ప్రయత్నం చేసినా ప్రధాన న్యాయమూర్తి వినిపించుకోక పోవడంతో ఇప్పుడు న్యాయవ్యవస్థే ప్రమాదంలో పడిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నారు.

బహిర్గతైమెన విభేదాలు
అయితే, ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటివరకు దేశం యావత్తు నలుగురు న్యాయమూర్తుల మాటలు మాత్రమే వింది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఏమంటున్నారన్నది ఎవరికీ తెలియదు. సాధారణంగా కోర్టు లో ఏదైనా వ్యాజ్యం వచ్చినపుడు ఆరోపణలు చేసినవారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి కూడా తమ తర పున వాదనలు వినిపించే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అంతా ఒకవైపు మాత్రమే వినిపిస్తోంది. రెండోవైపు ఏమీ తెలియడం లేదు. అందువల్ల ఏకపక్షంగా తీర్పులు ఇవ్వడం కూడా సమంజసం కాదు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా సామాన్యుడు ఏమీ కాదు. పలు సంచలన కేసులను విచారించి, జాతి యావత్తు గర్వించే తీర్పులు ఇచ్చినవారే. కానీ గడిచిన కొంతకాలంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తు ల మధ్య విభేదాలు వచ్చాయన్న విషయం ఆనోటా ఈనోటా వినిపిస్తూనే ఉంది. అది అలా ఉంటుండగానే ఒక్కసారిగా బుడగ పేలి.. విషయం మొత్తం దానంతట అదే బహిర్గతమైంది. 

ఆందోళనలో పౌరసమాజం 
ఒకప్పుడు పూర్వకాలంలో మర్యాదరామన్న ఉండేవారు. అప్పట్లో ఆయనే న్యాయమూర్తి. ఇరువైపులా వాదనలు విని తనకు తోచిన తీర్పు చెప్పేవారు. అది చాలావరకు న్యాయబద్ధంగా ఉందని చెప్పుకొనేవారు. ఆ తర్వాత క్రమంగా ప్రజాస్వామ్యం వచ్చింది. క్రమబద్ధమైన న్యాయవ్యవస్థ ఏర్పడింది. బ్రిటిష్ వలసదేశాలు ఎక్కువగా ఉండటంతో ఆ తరహా న్యాయవ్యవస్థనే అన్నిచోట్లా అమలులోకి తెచ్చారు. అదే ఇన్నాళ్లుగా అమలులో ఉంది. ఎక్కడైనా ఏదైనా వివాదం వస్తే దాన్ని తీర్చడానికి ప్రతి ఒక్కరూ కోర్టు మెట్లే ఎక్కేవారు. ఇప్పుడా కోర్టుకే సమస్య వస్తే.. ఏ మెట్టు ఎక్కాలి? ఎక్కడికి వెళ్లాలి? శాసన వ్యవస్థలోను, కార్యనిర్వాహక వ్యవస్థలోను ఉన్న లోపాలను సైతం సరిదిద్దడానికి న్యాయవ్యవస్థకు సర్వంసహాధికారాలు ఉన్నాయి. కానీ న్యాయవ్యవస్థలో ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలన్నది రాజ్యాంగంలో కూడా ఎక్కడా చెప్పలేదు. రోగికి చికిత్స చేసే వైద్యుడికే వ్యాధి వస్తే ఏంచేయాలి? తప్పనిసరిగా మరో వైద్యుడి వద్దకు వెళ్లాల్సిందే. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కూడా సుప్రీంకోర్టు పరిధిలోనే జరగాలి తప్ప ఇందులో రాజకీయ నాయకులు గానీ, మరేదైనా మూడోపక్షం గానీ జోక్యం చేసుకోవడం కూడా సరికాదు. ముళ్లకంచె మీద చీర పడినప్పుడు అడ్డదిడ్డంగా లాగితే చీర మొత్తం చినిగిపోతుంది. అందుకే అత్యంత జాగ్రత్తగా తీసుకుని దాన్ని భద్రంగా చూసుకోవాలి. అదే న్యాయాన్ని ఇక్కడ కూడా పాటించి, మన దేశం.. మన న్యాయ వ్యవస్థ పదిమందిలో నవ్వులపాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యావత్ సుప్రీంకోర్టుపైనే ఉంది. ఈ వివాదం సజావుగా సవుసిపోని పక్షంలో, నలుగురు న్యాయుమూర్తుల ధిక్కార వైఖరే స్ఫూర్తిగా మారి ఈ ధోరణి హైకోర్టులకు కూడా వ్యాపించి, న్యాయువ్యవస్థపై విశ్వాసం సడలే ప్రమాదం ఉందని పౌర సమాజం ఆందోళన చెందుతోంది.

Related Posts