
సికింద్రాబాద్ కంటోన్మెంట్
కాంగ్రెస్ పాలనలో ఏ టు జెడ్ వరకు జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ హోర్డింగులు దర్శనమిచ్చాయి.కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన లో అతని కుటుంబానికి,బంధు వర్గానికే కాంట్రాక్ట్ లు కేటాయించారని వాటిపై కమిషన్లు దండుకుంటున్నారని వెలసిన హోర్డింగులు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీ బస్ స్టాప్ సమీపంలో ఈ హోర్డింగులను బి అర్ ఎస్ నాయకులు వేశారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న భూ కుంభకోణాలు, అక్రమ దందాలు, రైతులపై దాడులు, నకిలీ పెట్టుబడులు, అక్రమ కూల్చివేతలు తదితర అంశాలను వివరిస్తూ ఈ హోర్డింగులు వెలిశాయి. రాత్రికి రాత్రి హార్డింగ్ వేయడంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండటంతో వెంటనే కంటోన్మెంట్ సిబ్బంది ఈ హోర్డింగ్ ను తొలగించారు.