YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే టిక్కెట్లపై 50 శాతం డిస్కౌంట్!

రైల్వే టిక్కెట్లపై 50 శాతం డిస్కౌంట్!

రైళ్లలో ప్రయాణానికి చాలా రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులు 50శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం విమానాల్లో ప్రయాణానికి అవలంభిస్తున్న ఈ విధానాన్ని త్వరలో రైల్వే ఛార్జీలకు కూడా వర్తింపజేసే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్త రైల్వే ఛార్జీలను సమీక్షించేందుకు ఏర్పాటైన రివ్యూ కమిటీ సిఫార్సులను రైల్వే బోర్డు అంగీకరిస్తే ఈ కొత్త ఛార్జీల విధానం అమలులోకి వస్తుంది. ఈ మేరకు రివ్యూ కమిటీ గత వారం రైల్వే బోర్డుకు తన నివేదికను సమర్పించింది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా ప్రయాణీకులకు టిక్కెట్‌పై డిస్కౌంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ విదానంలో ప్రతి 10 శాతం బెర్తులు బుకింగ్ అయిన తర్వాత ఛార్జీలను 10 శాతం మేర పెంచుతూ వెళ్తారు. తద్వారా కొన్ని బెర్తులు మాత్రమే ఉన్నప్పుడు వాటి కోసం ఎక్కువ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ విధానం కింద ప్రయాణీకుల టిక్కెట్లపై 50 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఛార్ట్ తయారైన తర్వాత ఖాళీగా ఉండే టిక్కెట్లను కూడా డిస్కౌంట్‌పై బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. 

అటు రివ్యూ కమిటీ సిఫార్సు మేరకు రైళ్లలో దిగువ బెర్త్‌లను ఐచ్ఛికంగా ఎంచుకునే ప్రయాణీకులు దీని కోసం అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విమానాల్లో ముందు వరుస సీట్ల కోసం అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుండగా...రైళ్లలో దిగువ బెర్త్‌లకు అదనపు ఛార్జీలను వసూలు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వయో వృద్ధులు, వికలాంగులు, గర్భిణి స్త్రీలకు మాత్రం దిగువ బెర్త్‌లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే కేటాయిస్తారు. 

Related Posts