YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

గులాబీ రంగు పురుగు నివారణకై అవగాహన సదస్సు

గులాబీ రంగు పురుగు నివారణకై అవగాహన సదస్సు

గులాబీ రంగు పురుగు నివారణకై అవగాహన సదస్సు
మద్దికేర సెప్టెంబర్ 19, 
పత్తి పంటలో ఏర్పడే గులాబి రంగు పురుగు పై అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం ను ఏర్పాటు చేశారు.మండల కేంద్రమైన మద్దికేర లో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నందు ఆత్మ  డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు.ఆత్మ ఏ డి ఏ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మద్దికేరలో నల్లరేగడి పొలాలలో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారని,పత్తి పంటకు గులాబీ రంగు పురుగు యొక్క బెడద అధికంగా ఉందని తెలియజేశారు.వీటి నివారణ కొరకు లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటను సాగు చేయడం వలన అధిక దిగుబడిని పొందవచ్చు అని రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఖాద్రి,ఏవో హేమలత, మరియు,ఎఇఓ లు,ఎంపీఈవో లు మరియు ఆత్మ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts