YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆస్కార్ రేసులో విజయ్ దేవరకొండ

ఆస్కార్ రేసులో విజయ్ దేవరకొండ

ఆస్కార్ రేసులో విజయ్ దేవరకొండ
హైద్రాబాద్, 
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఆస్కార్ బరిలో ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజమే. ఆస్కార్స్ 2019కు ఎంపికైన 28 భారతీయ చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్’ కూడా ఉండటం విశేషం. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయితే ఇందులో ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంతగా ఏముందనేది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. సినిమాలో కథ పెద్దగా లేదు. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఏదో కారణం వల్ల విడిపోవడం, కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఒకటవడం.ఇది ప్రతీ సినిమాలో చూపించే కామన్ కథే. కొత్తదనం ఏదన్నా ఉందంటే.. అది హీరోయిన్‌ క్రికెటర్ పాత్రలో నటించడం, ఇలాంటి వృత్తుల్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయో చూపించడానికి మీటూను చూపించడం మాత్రమే కాస్త కొత్త పాయింట్లుగా కనిపించాయి. సంగీతం కూడా ఫర్వాలేదనిపించింది. 2018లో ఇంతకంటే మంచి కాన్సెప్ట్‌తో విజయం సాధించిన సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. వాటికి దక్కని ఈ అరుదైన అవకాశం డియర్ కామ్రేడ్‌కు దక్కడం గమనార్హం. దీనిపై విజయ్ దేవరకొండ, భరత్ కమ్మ, రష్మిక మందన స్పందించాల్సి ఉంది. ఏదేమైనా అంతర్జాతీయ స్థాయిలో మన కాన్సెప్ట్‌లు, మన కథలు ఖ్యాతి చెందుతుండడం గర్వించాల్సిన విషయమే.
ఆస్కార్స్‌కు నామినేట్ అవబోతున్న 28 భారతీయ సినిమాలు ఇవే
ఆనంది గోపాల్
అంధాధున్
అండ్ ది ఆస్కార్ గోస్ టూ
ఆర్టికల్ 15
బాబా
బదాయి హో
బద్లా
బండిశాలా
బుల్‌బుల్ కెన్ సింగ్
చాల్ జీవి లాల్యే
డియర్ కామ్రేడ్
ఘడేకో జిలేబీ ఖిలానే లేజారియా హూ
గల్లీ బాయ్
హెల్లారో
కేసరి
కాంతో
కురుక్షేత్ర
మాల్ ఘాట్- క్రైం నెం 103/2005
నగర్ కీర్తన్
ఒలు
ఒత్త సెరుప్పు సైజ్ 7
పహూనా- ది లిటిల్ విజిటర్స్
సూపర్ డీలక్స్
తారీఖ్- ఎ టైంలైన్
ది టష్కెంట్ ఫైల్స్
ఉరి- ది సర్జికల్ స్ట్రయిక్స్
ఉయారే
వడా చెన్నై
మన భారతీయ సినిమాల్లో ఏదో ఒక దానికి ఆస్కార్ అవార్డు రాకపోదా అని ఎదురుచూస్తున్న భారతీయులు కోట్లల్లో ఉన్నారు. ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మన భారతీయ సినిమాలు ఎన్నో నామినేట్ అయ్యాయి కానీ ఇప్పటివరకు ఒక్క భారతీయ సినిమాకు ఆస్కార్ వరించలేదు. ఒకవేళ వచ్చినా భారతీయ లఘ చిత్రాలకు అవార్డులు వచ్చాయి కానీ ఓ కమర్షియల్ సినిమాకు కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు కానీ ఆస్కార్ వరించలేదు. ఈసారి 92వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుక 2020 ఫిబ్రవరి 9న జరగనుంది.

Related Posts