YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండేళ్లే పాలీహౌస్ నిధులు

రెండేళ్లే పాలీహౌస్ నిధులు

వరంగల్, సెప్టెంబర్ 26,
 పాలీహౌస్‌ల నిర్మాణం కొన్ని కంపెనీలకే అప్పగించడంపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి.  పాలీహౌస్‌ల వల్ల బాగుపడకపోగా సంపాదించుకున్న డబ్బులు పెట్టి మధ్యలో మధ్యలో నిర్మాణం ఆగిపోయిందని ఆందోళన చెందుతున్నారు. గత 2017-18లో పాలీహౌస్‌లు ఏర్పాటు చేసి, అందులో పూలు పండించుకున్న రైతులకు మాత్రం ఒక ఏడాది పంటలు పండించినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఆసక్తి కనబర్చి పాలీహౌస్‌లు నిర్మించుకుంటామని ముందుకొచ్చిన రైతులకు నిరాశే ఎదురైంది. పాలీహౌస్‌లో పంటలు పండించి లాభాలు గడించిన రైతులు ప్రస్తుతం లేరని చెప్పొచ్చు. దీనికి భూగర్భ జలాలు అడుగంటిపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోందిహైటాస్‌, ఇండస్‌ గ్రీన్‌హౌస్‌, జైన్‌ ఇరిగేషన్‌, పైప్స్‌ అండ్‌ ఫ్లో, జై హనుమాన్‌, శ్రీనివాస్‌ ఫ్యాబ్రికేటర్స్‌, జెన్‌నెక్స్ట్‌ అనే కంపెనీలకు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కంపెనీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని అధికారులు చెప్పారు. అయితే ఈ ఏడు కంపెనీల్లో ఒకటి రెండు కంపెనీలు మాత్రమే చురుగ్గా పని చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలకు రావాల్సిన బిల్లులు రావట్లేదని సుమారు అన్ని కంపెనీలు వివిధ స్థాయిల్లో నిర్మాణాలు నిలిపేశాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పేర్లు చెప్పడానికి కూడా జంకుతున్నారు. తమ బిల్లులు నిలిపేస్తారనే భయం వారిని వెన్నాడుతోంది.. ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు చెందిన రైతులు ఎకరానికి సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఇతర సామాజిక తరగతులకు చెందిన రైతులు రూ.10 లక్షల వరకు ఖర్చుపెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . సభలు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నదానికి కిందిస్థాయిలో అధికారులు అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదంటూ రైతులు వాపోతున్నారు. పాలీహౌస్‌లకు సంబంధించి ఎస్సీ,ఎస్టీ రైతులు తమ వాటా కింద ఖర్చు పెట్టుకున్న డబ్బులు ఇంకా ఆయా కంపెనీలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాగితాలకే పరిమితమైందని వాపోతున్నారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు పాలీహౌస్‌లో 95శాతం అని చెబుతున్నా మట్టితో తయారు చేసుకునే బెడ్స్‌, విత్తనాలు, మొక్కలకు 75శాతం సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ స్కీమ్‌ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు తొమ్మిదెకరాలు కేటాయించినట్టు తెలిసింది. దీనికిగానూ 16 దరఖాస్తులు అందినట్టు సమాచారం. పాలీహౌస్‌ల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని పలువురు రైతులు కోరుకుంటున్నారు. పాలీహౌస్‌ల నిర్మాణానికి ఔత్సాహికులైన ఎస్సీ,ఎస్టీ రైతులకు 95శాతం సబ్సిడీ ఇస్తామని అధికారులు చెబుతున్న మాటలు అమలుకు నోచుకోవడం లేదు. 100 గజాల నుంచి మొదలుకొని మూడెకరాల వరకు పాలీ హౌస్‌ల నిర్మాణం చేపట్టవచ్చని ప్రభుత్వం ప్రకటించిందిగానీ ఇది ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి.

Related Posts