
మహిళను హత్య చేసిన ప్రియుడు
ములుగు అక్టోబరు 3,
ములుగు జిల్లా ములుగు మండలంలోని గట్టమ్మ సమీపంలోని అడవిలో మహిళ మృతదేహం లభించింది. మృతురాలు నునావత్ రాధ గా పోలీసులు గుర్తించారు. మంతకుడు జాటోత్ భోజ్య అనే వ్యక్తిగా అనుమానించి ఆరెస్టు చేసారు. భర్త చనిపోయి వంటరిగా ఉంటున్న రాధ కు అదే గ్రామానికి చెందిన జాటోత్ భోజ్యా కు గత కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం రాధ కనుబడుట లేదని ములుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో పోలీసులు విచారణ జరిపారు. మహిళ కాల్ లిస్టును పరిశీలించగా అదే గ్రామానికి చెందిన భోజ్య అనే వ్యక్తితో మాట్లాడినట్టుగా తెలిసింది. భోజ్య ని పోలీసులు ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. గట్టమ్మ వద్ద అడవిలో శవం పూర్తిగా కుళ్ళి పోయి ఉంది. ఇక్కడే శవ పంచనామా నిర్వహించారు.