
న్యూఢిల్లీ
కరవుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమను ఆదుకోవడానికి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. ఎగువ, దిగువ రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో మిగులు జలాలు ఉంటాయని ఆయనతో చెప్పారు. నదీ పరివాహక ప్రాంతంలో చిట్టచివర ఉన్న ఏపీ రాష్ట్రానికి నీటిని వినియోగించుకునే హక్కు ఉందని షాతో వెల్లడించారు. సముద్రంలోకి వెళ్లే ఈ జలాల నుంచి 200 టీఎంసీలతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.