
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఆ రుణాన్ని సేకరించింది.
32 ఏళ్ల కాల పరిమితి, 7.10 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు: 35 ఏళ్ల కాల పరిమితి, 7.09 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోటు: 38 ఏళ్ల కాల పరిమితి, 7.09 శాతం వార్షిక వడ్డీతో రూ.500 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకున్నది. తెలంగాణతో కలిపి దేశంలోని 12 రాష్ట్రాలు రూ.26,900 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.