YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు జ్ఞానమార్గం తెలంగాణ

బతుకమ్మ ముగింపు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

బతుకమ్మ ముగింపు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

బతుకమ్మ ముగింపు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
హైదరాబాద్, అక్టోబర్ 4 
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ముగింపు వేడుకలు అంబరాన్ని తాకేలా ఏర్పాట్లు చేస్తోంది.  అందులో భాగంగా ముందస్తు ఏర్పాట్లు ను రాష్ట్ర అబ్కారీ, పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి వి  శ్రీనివాస్ గౌడ్ హుస్సేన్ సాగర్ జలాశయం తో పాటు బతుకమ్మ ఘాట్ పరిసరాలను బోట్ ద్వారా వెళ్లి పరిశీలించారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజు లాల్ బహదూర్ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో   వేలాదిమంది కళాకారులతో బతుకమ్మల ర్యాలీ ని నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ట్యాంక్ బండ్ మరియు హుస్సేన్ సాగర్ జలాశయం లో వెలుగుల బతుకమ్మ లను విన్నూతనంగా ఏర్పాటు చేయటం వల్ల ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు. అదేమాదిరి గా ముగింపు రోజు బతుకమ్మ సంబురాల విజయోత్సవాన్ని పురస్కరించుకుని మిరుమిట్లు గొలిపే భారీ బాణసంచా ను కాల్చటం వంటి ముందస్తు ఏర్పాట్లు ను మంత్రి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, 
టూరిజం ఎండీ మనోహర్ ల తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related Posts