లెక్చరర్ జేఏసీ నేత ఆస్థులపై ఏసీబీ సోదాలు
హైదరాబాద్ అక్టోబర్ 4 :
తెలంగాణ లెక్చరర్ జేఏసి మధుసూదన్ రెడ్డి నివాసాలలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు తన బంధువుల ఇండ్లలో కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుపుతోంది. మొత్తం 10 చోట్ల జరుగుతున్న ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ లో ఉంటున్న ఫ్లాట్ ను 24 లక్షలు తీసుకుని 8 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. కోటి 81లక్షల కు ఇల్లు కొని 91 లక్షలకు రిజిస్ట్రేషన్ చేపించుకున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు అయన బంధువుల వద్ద 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Related Posts