YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాత ఎటీఎంలతో...దొంగలు స్టైల్ మార్చేస్తున్నరు.

పాత ఎటీఎంలతో...దొంగలు స్టైల్ మార్చేస్తున్నరు.

పాత ఎటీఎంలతో...దొంగలు స్టైల్ మార్చేస్తున్నరు.
హైద్రాబాద్, అక్టోబరు 5,
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు మరో దారి చూసుకున్నారు. వారి చూపు ఏటీఎంలపై పడింది. అవును.. దొంగల ముఠాలు ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నాయి. ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బు దోచుకుంటున్నారు. నగరంలోని ఏటీఎం కేంద్రాలు దొంగలకు అనువుగా మారుతున్నాయి. బ్యాంకర్ల నిర్లక్ష్యం వారికి వరమైంది. సెక్యూరిటీ సిస్టమ్ లేనిచోట్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి పని కానిస్తున్నారు. గ్యాస్ కట్టర్లు, రాడ్లతో ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేసి అందులోని డబ్బు దోచుకుంటున్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు 2012 మోడల్ ఏటీఎం యంత్రాలను నియోగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఒక్కో ఏటీఎంలో రూ.10-30 లక్షల వరకు క్యాష్ పెడతారు. భద్రతాపరంగా మాత్రం పటిష్ఠ చర్యలు తీసుకోవడం లేదని పోలీసులు చెప్పారు. దొంగతనాల గురించి పోలీసులు పదే పదే అప్రమత్తం చేసినా బ్యాంకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దోపిడీకి యత్నిస్తే పోలీసులను అప్రమత్తం చేసే అత్యాధునిక వ్యవస్థ లేదు. కనీసం సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు కూడా లేవు. ఇది దొంగలకు వరంగా మారింది.దొంగల భయంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఇళ్లలో దొంగలు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, అత్యాధునిక లాకర్లు, మెయిన్ డోర్ కి సెంట్రల్ లాకింగ్ సిస్టం తదితర టెక్నాలజీతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడున్నా ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే అలారం మోగి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఇవన్నీ దాటి ఇంట్లోకి వెళ్లినా చిల్లర డబ్బులు మినహా ఏమీ దొరకడం లేదని గ్రహించిన దొంగలు.. కొత్త చోరీ మార్గాలను ఎంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.ఇకపోతే రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయి. హరియానాకి చెందిన రెండు అంతరాష్ట్ర ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ముఠా మున్సురాబాద్ లోని ఎస్బీఐ ఏటీఎంలో రూ.12 లక్షల క్యాష్ దోచుకుంది. మరొకటి హయత్ నగర్ నుంచి హబ్సిగూడ వరకు 10 నుంచి 15 ఏటీఎంలలో చోరీలకు పాల్పడటం గమనార్హం. ఇటీవల దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డిపై కారు ఎక్కించేందుకు ప్రయత్నించి దూలపల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన దుండగులు అంతకుముందే రెండు ఏటీఎం కేంద్రాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ తరుణంలో అప్రమత్తమైన సైబరాబాద్, రాచకొండ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ బ్యాంకులకు సూచిస్తున్నారు. దొంగతనం చేసేందుకు యత్నిస్తే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసేలా సెక్యూరిటీ వ్యవస్థ, భద్రతా సిబ్బందిని ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని పోలీసులు చెబుతున్నారు. పాత యంత్రాలను వీలైనంత తొందరగా మార్చాలని సూచించారు. సమాచారం అందిన 5 నిమిషాల్లోపే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని చెప్పారు. పదే పదే విజ్ఞప్తి చేసినా కొన్ని బ్యాంకులు స్పందించడం లేదని.. ఇప్పటికైనా అప్రమత్తం కావాలని పోలీసులు కోరారు. ఆ తర్వాత బాధ పడినా లాభం లేదన్నారు.

Related Posts