YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బికినీ ఫొటో షూట్లలో ఇల్లి

బికినీ ఫొటో షూట్లలో ఇల్లి

బికినీ ఫొటో షూట్లలో ఇల్లి
హైద్రాబాద్,
గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బికినీలు ధరించి ఫొటో షూట్లలో తెగ పాల్గొంటోంది. డ్రెస్ ఎలా ఉన్నా క్లీవేజ్ షో మాత్రం అస్సలు తగ్గట్లేదు. తాజాగా ఇలియానా మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో బికినీ వేసుకుని దిగిన మరో ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఆమె గతంలో పోస్ట్ చేసిన ఫొటోలతో పోలిస్తే ఈ ఫొటో పీక్స్‌లో ఉంది. క్లీవేజ్ బాగా కనిపించేలా దగ్గర్నుంచి ఫొటో దిగింది. ‘బికినీ అప్రీసియేషన్ పోస్ట్’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఫొటో చాలా బ్యూటిఫుల్‌గా ఉందని, ఆమె ఫిగర్ సూపర్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తనలో ఇంకా ఆ హాట్‌నెస్ అలాగే ఉందని నిరూపించుకోవడానికి ఈ ఫొటోలు దిగే కార్యక్రమంలో ఉన్నట్లుంది. ఇలియానా తన ఫొటోలను ఆస్ట్రేలియాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో తీయించుకుంటుంది. దాదాపు మూడేళ్లు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఇటీవల మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాంతో తన ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠాతో తీయించుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇలియానా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.
ప్రస్తుతం ఆమె ‘పాగల్ పంతి’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఏదేమైనా ఇలియానాకు గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇందుకు కారణం ఆమె ఒక్కసారిగా లావైపోవడం కావచ్చు, లేదా తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి ఆమే సినిమాలు చేయడం తగ్గించైనా ఉండొచ్చు. అదీకాకుండా ఆండ్రూని ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఆమె సోషల్ మీడయాలో ఆండ్రూను హబ్బీ (భర్త) అని సంబోధించడమే. ఇలియానా డేటింగ్‌లో ఉండటం, అదే సమయంలో ఆమె గర్భిణి అని వార్తలు రావడం ఇలియానా కెరీర్‌ను మైనస్ పాయింట్ అయింది. ఈ విషయంలో ఇలియానాకు ఆండ్రూకు మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌ను సినిమాలపైనే పెట్టాలనుకుంటోంది. ఏవో కారణాల వల్ల పోయిన తన క్రేజ్‌ను మళ్లీ సంపాదించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Related Posts

0 comments on "బికినీ ఫొటో షూట్లలో ఇల్లి"

Leave A Comment