
అన్నవరం లాడ్జీలో దంపతుల ఆత్మహత్య
కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కొండదిగువ ప్రైవేటు లాడ్జిలో హైదారాబాద్ కు చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హైదరాబాద్కు చెందిన పవన్, ధనలక్ష్మిగా గుర్తించారు. పవన్ హైదరాబాద్లో ట్రావెల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఘటనాస్థలంలో సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్టు దంపతులు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. వారిద్దరూ తమ కారులో ఈ నెల ఆరవ తేది ఉదయం అన్నవరం వచ్చి స్నేహ రెసిడెన్సీ రూమ్ నెంబర్.206 అద్దెకు తీసుకున్నారు. మరుసటి రోజు రూమ్ ఎక్స్టెండ్ చేయించుకున్నారు. మంగళవారం ఉదయం వారు ఖాళీ చెయ్య లేదని లాడ్జి సిబ్బంది వెళ్లితే తలుపులు
తియ్యలేదు. దాంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తీయించారు. వారిరువురూ ఓకే తాడుతో ఉరివేసుకొని చనిపోయి వున్నారు. అక్కడే వారు వ్రాసిన 'సూసైడ్ నోట్ లభించింది.
తమ చావుకు ఎవరూ భాద్యులు కాదని, తన తొందరపాటు నిర్ణయాలే కారణమని, అందరూ చెప్పినట్టు వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కోన్నారు. కానీ ఇప్పుడు ప్రయోజనం లేదని, మీ దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం నిలబెట్టుకోలేక పోయానని, చాలా అప్పులు చేసి వ్యాపారం చేసాను గాని ఇంటికి ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని, నా కొడుకుని ఇలా
వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని, వాడి భాద్యత ఎవరో ఒకరు తీసుకోవాలని లేఖలో కోరారు. తనమీద కోపం తన కొడుకు మీద చూపించ వద్దని, నేను చేసిన అప్పులకు ఎవరికీ భాద్యత లేదని మృతురాలు ధనలక్ష్మి లేఖలో రాసింది.