YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇవాళ్టి నుంచి ఏపీలో కంటి వెలుగు

ఇవాళ్టి నుంచి ఏపీలో కంటి వెలుగు

ఇవాళ్టి నుంచి ఏపీలో కంటి వెలుగు
విజయవాడ, 
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకం ఈ నెల 10న ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రారంభకానుంది. వరల్డ్ సైట్ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం 
మొత్తం మూడేళ్లపాటు అమలవుతుంది.కంటి వలుగు పథకాన్ని 5 దశల్లో అమలు చేస్తారు.. పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల్ ఛైర్మన్‌గా టాన్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంటి వెలుగు పథకాన్ని తొలి రెండు దశల్లోవిద్యార్థులకు అమలు చేస్తారు. తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు, మందుల్ని సిద్ధం చేశారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

Related Posts