YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జార్జ్ రెడ్డి" ట్రైలర్ అధ్బుతమైన రెస్పాన్స్

జార్జ్ రెడ్డి" ట్రైలర్ అధ్బుతమైన రెస్పాన్స్

జార్జ్ రెడ్డి" ట్రైలర్ అధ్బుతమైన రెస్పాన్స్
"జార్జ్ రెడ్డి"...దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని  
నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు..  నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో  విద్యార్తులను కదిలించిన వ్యక్తి,  అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు..ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ సినిమా బయోపిక్ అయినా..ట్రైలర్ చూస్తుంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో నే చెప్పారు. దసరా సందర్భంగా
రిలీజ్ చేసిన ట్రైలర్ కు అధ్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.ఇక ఇండస్ట్రీ నుండి ప్రముఖులు ఫోన్ చేసి మరీ టీమ్ ను అభినందిస్తున్నారు.హీరోలు నితిన్,సాయి ధరమ్ తేజ్,దర్శకులు రామ్ గోపాల్ వర్మ,సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్ చార్మిలు తమ సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ను షేర్ చేసి టీమ్ కు అభినందనలు తెలిపారు.. 
1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తంగా ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ టీమ్ ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని 
పెంచింది. ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో
గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇటీవల "నాల్" సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.

Related Posts