YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల
 : బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3.23 లక్షల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. గత ఏడాది 2.17 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ ద్వారా 4.24 
లక్షల మంది తిరుమలకు చేరుకున్నారని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించగా.. గత ఏడాది 24 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్నారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులు రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  రూ.20 కోట్ల 50 లక్షల 85 వేల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.

Related Posts