
రోడ్డు ప్రమాదంలో బావబావమరిదులు మృతి
నెల్లూరు ,
నెల్లూరు జిల్లా లో విషాదం నెలకొంది. మోటర్ బైక్ ను ఒక లారీ ఢీ కొట్టడంతో బైక్ పై వెళుతున్న బావ, బావమరిదులు దుర్మరణం పాలయ్యారు. భార్య కు తీవ్రగాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన దంపతులు ముత్తయ్య, భార్య రమాదేవి, బావ మరిది సాయి సంతోష్ లు గూడూరు పట్టణంలో మోటర్ బైక్ కొనుగోలు చేసి చిల్లకూరు మండలం అంకులపాటురు కు మోటర్ బైక్ పై ముగ్గురు వెళ్ళుతున్న సమయంలో చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో మోటర్ బైక్ ను లారీ ఢీ కొట్టడంతో బావ ముత్తయ్య(40) బావ మరిది సాయి సంతోష్(24) అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్య రమాదేవి తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.