YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మధ్య ప్రదేశ్ లో దారుణం

మధ్య ప్రదేశ్ లో దారుణం

మధ్య ప్రదేశ్ లో దారుణం
భోపాల్, 
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను, ఆమె రెండేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన దుర్మార్గులు ఆమెకు రెండ్రోజుల పాటు నరకం చూపించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు శరీరంగపై సిగరెట్లతో కాలుస్తూ ఆమెతో యాసిడ్ తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని కారులో తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు.మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాకు చెందిన ఓ మహిళ(28)కు 8ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దకు సంతానం కలిగారు. కొంతకాలంగా దంపతుల మధ్య విబేధాలు రావడంతో ఏడాది క్రితం ఆమె భర్తకు విడాకులిచ్చేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ భర్త ఆమెపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రెండేళ్ల కుమార్తెతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన ఆమెను మాజీ భర్త, అతడి సోదరి, సోదరి భర్త, వారి ఇద్దరు కుమారులు కలిసి అపహరించారు.ఖర్చోడ్‌ ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు ఆమెను తీసుకెళ్లి దారుణంగా హింసించారు. మాజీ భర్త ఆమెను సిగరెట్లతో కాల్చి నరకం చూపించాడు. ఇద్దరు మేనల్లుళ్లు మద్యం తాగి రెండేళ్ల చిన్నారి ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెతో యాసిడ్ తాగించారు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులో తీసుకెళ్లి ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు.బాధితురాలిని చూసిన స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి రత్లాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి మాజీ భర్త, అతడి బావ, ఇద్దరు మేనల్లుళ్లను అరెస్ట్ చేశారు. మాజీ భర్త సోదరి పరారీలో ఉందని, అమె కోసం గాలిస్తున్నట్లు రత్లాం ఎస్పీ గౌరవ్ తివారీ తెలిపారు.

Related Posts