
బస్సు లోయలో పడి ఐదుగురు మృతి
కాకినాడ
తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర విషాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది. ఘాట్రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మారేడుమిల్లి వద్ద అడవుల్లో ఈ సంఘటన జరిగింది. అడవి ప్రాంతం కావడంతో ఫోన్ కమ్యూనికేషన్ అందుబాటులో లేదు. విషయం తెలియగానే అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ప్రమాదనికి గురైన ప్రైవేటు ట్రావెల్సు బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. భద్రాచలం నుంచి రాజమండ్రికి ఈ బస్సు వస్తోందని తెలుస్తోంది.