YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సత్యనారాయణ హంతకులను తక్షణం అరెస్టు చేయాలి డిజిపికి ఎపిఎంఎఫ్ వినతి 

సత్యనారాయణ హంతకులను తక్షణం అరెస్టు చేయాలి డిజిపికి ఎపిఎంఎఫ్ వినతి 

సత్యనారాయణ హంతకులను తక్షణం అరెస్టు చేయాలి
డిజిపికి ఎపిఎంఎఫ్ వినతి 
అమరావతి, 
తూర్పుగోదావరి జిల్లా తొండంగి  అర్బన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణ హత్య దారుణమైన సంఘటన అని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.  డిల్లీబాబు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సత్యనారాయణ హంతకులను తక్షణం అరెస్టు చేయాలని   డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు డిజిపి గౌతమ్ సవాంగ్, హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కిషోర్ లతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి  ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుగా విధి నిర్వహణ  పూర్తి చేసుకుని  మంగళవారం రాత్రి ఎస్. అన్నవరంలోని తన నివాసానికి చేరుకుంటున్న సత్యనారాయణ ను తన ఇంటి సమీపంలోనే దుండగులు దారి కాచి కిరాతకంగా హత్య చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్యనారాయణపై గత నెలలో కూడా హత్యాయత్నం జరిగిందని, దీనిపై తుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారని ఆరోపించారు. అప్పుడే పోలీసులు తగిన రీతిలో స్పందించి నిందితులపై చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని డిల్లీబాబు వ్యాఖ్యానించారు. సత్యనారాయణ హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని డిల్లీబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో జమీన్ రైతు ఉపసంపాదకుడిపై దాడి జరిగిందని, అనంతపురంలో జర్నలిస్టు బాబ్జాన్ పైన దాడి జరిగిందని వివరించారు. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు స్వయంగా అక్కడి విశాలాంధ్ర  రిపోర్టర్ నాగార్జునరెడ్డి పై దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి బి. సతీష్ బాబు, ఎపిఎంఎఫ్ నాయకులు ఇందుకూరి వెంకట రామరాజు, ఎవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts