
భార్యను హతమార్చిన భర్త
కర్నూలు
కట్టుకున్న భర్తే తన భార్యను హతమార్చిన ఘటన గురువారం ఉదయం కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలోని రామతీర్థంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దయ్య అనే వ్యక్తి తన భార్య సుబ్బలచ్చమ్మ(45)పై గత కొంతకాలంగా అనుమానంతో ఘర్షణ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో మద్దయ్య ఇంట్లో ఉన్నసుత్తితో భార్య తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారంతో నందివర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ముద్దయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.