
దివాకర్ ట్రావెల్స్ బస్సు కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
అవుకు రిజర్వాయర్ వద్ద కాలువ లోకి దూసుకుపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు
బస్సులో యిద్దరు డ్రైవర్లు క్లినర్ తో సహా 18 మంది ప్రయాణికులు
ప్రాణహాని జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
కర్నూలు
కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ వద్ద అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి కి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదానికి గురయింది. రిజర్వాయర్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి వర్రీ పొలాలు కాలువ లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం యిద్దరు డ్రైవర్లు ఒకరు క్లినరు తో కలిపి 18 మంది వున్నార. 18 మంది ప్రయాణికులతో రాత్రి విజయవాడ నుండి బయలుదేరిన బస్సు అనంతపురం కు ఆరున్నరకు చేరుకోవాల్సి ఉంది. అయితే అవుకు రిజర్వాయర్ దగ్గరకు రాగానే తెల్లవారుజామున వర్షం పడడంతో ఐదు గంటల సమయం లో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బస్సు వరి పొలాల కాల్వలోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అంతా క్షేమంగా బయటపడ్డా ప్రయాణికులు. ప్రయాణికులు కు ప్రత్యామ్నాయ మరోబస్సులో గమ్యస్థానాలకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.పంపింది.