
మేక మేత కోసం హత్య
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లి లో దారుణం జరిగింది. మేకల మేత కోసం ఇరువురు మద్య కోట్లాట ఒకరు మృతి చెందారు. మేకల మేత కోసం పనస కొమ్మలు కోస్తుండగా ఇరువురి మధ్య కొట్లాట జరిగిందని సమాచారం. మా అత్త తోటల్లో ఎందుకు తీస్తూన్నావు అని కుత్తుం జానకి రావు (60) సైన నారాయణ (45)ను అడ్డుకున్నాడు. దాంతో ఇరువురి మధ్య కోట్లాట జరిగింది. స్థానికులు ఇరువురిని సర్ది చెప్పటం తో అక్కడి నుండి వెళ్ళిపోయారు. మళ్లీ ఇద్దరు వచ్చి అదే స్థలంలో ఒకరి పై ఒకరు పిడిగుద్దులు తో ఘర్షణ పడ్డారు. అక్కడ నుండి జానకి రావు ఇంటికి చేరగానే నీరు త్రాగి వాంతులు చేసుకొన్నాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు చికిత్స పొందుతూ జానకిరావ్ మృతి చెందాడు. నిందితుడు నారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.