YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హత్య కేసులో తొమ్మిది మంది ఆరెస్టు

హత్య కేసులో తొమ్మిది మంది ఆరెస్టు

హత్య కేసులో తొమ్మిది మంది ఆరెస్టు
గుత్తి  
అదనపు కట్నం కోసం కుటుంబ సభ్యులతో కలసి భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఎనిమిది మంది ముద్దాయిలను అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా వున్నాయి. వాఅనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి కి చెందిన ఈబూతి లక్ష్మయ్య, భాగ్యమ్మ దంపతుల కుమార్తె చెంచులక్కను అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైన నడిపి బాలన్న , లక్ష్మీ దేవి దంపతుల మూడవ కుమారుడు గోపాల్ తో  నాలుగు నెలల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహమైన మరుసటిరోజునుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, బావలు వేధించటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తారీఖున  రాత్రి అదనపు కట్నం తీసుకురావాలని కుటుంబ సభ్యులు అందరు కలసి బయటి తోసేశారు.అయితే తాను గోపాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని కట్నం ఎందుకు ఇవ్వాలని చెంచెలక్క మొండికేసి కూర్చోంది. దీంతో కోపంతో చెంచులక్క పై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా గొంతు నులిమి చంపేశారు.బాధితురాలి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఐదు రోజుల వ్యవధిలోనే హత్యకు పాల్పడిన హంతకులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు చెంచులక్కను అదనపు కట్నం కోసమే భర్త తాటికొండ గోపాల్ తో పాటు తన తల్లిదండ్రులు, అన్నదమ్ములందరూ హత్యకు కుట్రపన్ని హతమార్చినట్టు నేరం అంగీకరించారు. వారి నుండి రెండు ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. మొదటి ముద్దాయి అయిన గోపాల్ను అనంతపురం జువెనైల్ జస్టీస్ బోర్డుకు తరలించారు. మిగతా ముద్దాయిలను రిమాండ్కు గుత్తి కోర్టులో హాజరుపరిచారు.

Related Posts