
ఇంటి ఓనర్ వేధింపులతో కృష్ణానదిలో దూకిన యువకుడు
విజయవాడ
ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలో దూకిన యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు కాపాడారు. ఇంటి యజమాని వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు సింహాద్రి తెలిపాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వడం కొంచె ఆలస్యం అయిందని, దీంతో ఇంటి ఓనర్ ప్రతి రోజూ తిడుతున్నారని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేయడంతో భరించలేక మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. ఎంత కష్టపడినా సమయానికి డబ్బులు రావడంలేదని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని చెప్పాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుడు మాట్లాడుతూ బాధితుడు నదిలో ముళ్లచెట్లు పట్టుకుని పెనుగులాడుతూ.. అరుస్తున్నాడని, తాము వెళ్లసరికి కొంచెం వీక్గా ఉన్నాడని చెప్పారు. వెంటనే బోటులోకి ఎక్కించి, ధైర్యం చెప్పి ఒట్టుకు తీసుకువచ్చామని చెప్పారు.