
కల్కి ఆశ్రమంలో కొనసాగిన ఐటీ దాడులు
చిత్తూరు
కల్కి భగవాన్ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలోలోని పలు ప్రాంతాలు సహా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్ల భారత కరెన్సీ, రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం. ఇక ఏపీ, తమిళనాడు సహా ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమం చుట్టూ భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే వెయ్యి ఎకరాలకు పైగా భూములున్నట్లు గుర్తించారు.